కాంగ్రెస్ ఆశావహుల నిరాశ..!

Published on

కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుల ఎంపికలో ఆశలు నిరాశలు

అధిష్టానం నిర్ణయంతో జిల్లాల్లో నేతల్లో చర్చల దుమారం

మన భారత్, ఆదిలాబాద్: కాంగ్రెస్ అధిష్టానం తాజా ప్రకటనతో నాలుగు జిల్లాల్లో కొత్త డీసీసీ అధ్యక్షుల నియామకం పూర్తయింది. ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నరేశ్ జాదవ్, కుమ్రం భీం–ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షురాలిగా అత్రం సుగుణ, నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా వెడ్మ బొజ్జు, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా రఘునాథ్‌ను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధికారికంగా ప్రకటించింది.

ఈ నియామకాలు వెలువడడం తో ఆశావహులలో నిరాశ వెల్లివిరిసింది. ఆదిలాబాద్ జిల్లాలో డీసీసీ అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్న నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్ నేత శ్రీకాంత్‌రెడ్డి, గోక గణేష్ రెడ్డి తో పాటు పలువురు నాయకులకు ఈసారి అధిష్టానం అవకాశాన్ని ఇవ్వలేదు.

నిర్మల్ జిల్లాలో శ్రీహరి రావు, పత్తిరెడ్డి రాజేశ్వరరెడ్డి, నారాయణరావు పటేల్ తదితరులు పోటీలో ఉన్నప్పటికీ, చివరకు వెడ్మ బొజ్జుకే ఎంపిక దక్కింది.

మంచిర్యాల, కుమ్రం భీం–ఆసిఫాబాద్ జిల్లాల్లో కూడా డీసీసీ పదవిని ఆశించిన పలువురికి నిరాశే ఎదురైంది.

పదవి రాని నేతలు తమ తదుపరి రాజకీయ నిర్ణయాలపై ఏ మార్గాన్ని ఎంచుకుంటారనే దానిపై జిల్లాల్లో చర్చలు వేడెక్కుతున్నాయి. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలు, జిల్లా నాయకత్వంపై ఈ నియామకాల ప్రభావం ఎలా ఉంటుందో ఆసక్తిగా మారింది.

Latest articles

అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్

మన భారత్, జైనథ్: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...

పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు.. భారీ వాహనాలకు నో ఎంట్రీ

మన భారత్, ఆదిలాబాద్: పట్టణంలోని తాంసి బస్టాండ్ సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్...

పంచాయతీలకు రూ.250 కోట్లు విడుదల.. గ్రామీణాభివృద్ధికి ఊతం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణలో గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల అభివృద్ధి పనుల...

More like this