డ్రాయింగ్–టైలరింగ్–ఎంబ్రాయిడరీ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలి
డిసెంబర్ 5లోగా ఫీజు గడువు
సైట్ bse.telangana.gov.in
మన భారత్, ఆదిలాబాద్: డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ లోయర్ మరియు హయ్యర్ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ పరీక్షలు వచ్చే ఏడాది జనవరులో నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) రాజేశ్వర్ వెల్లడించారు. ఈ కోర్సులకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 5లోపు పరీక్ష ఫీజులు చెల్లించి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన సూచించారు.
ఆన్‌లైన్ దరఖాస్తు bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. అభ్యర్థులు దరఖాస్తు ఫారం నింపిన తర్వాత, పూర్తి చేసిన అప్లికేషన్‌తో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లను డీఈఓ కార్యాలయంలో సమర్పించాలి.
ఈ పరీక్షలు టెక్నికల్ రంగాల్లో నైపుణ్యాలకు ప్రభుత్వ గుర్తింపు పొందేందుకు ఉపయోగపడతాయని, ఉద్యోగావకాశాలకు కూడా తోడ్పడతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
