విద్యలో నూతన దశకు నాంది..

Published on

📰 Generate e-Paper Clip

విద్యలో నూతన దశకు నాంది: AIతో విద్యార్థుల జవాబు పత్రాల వాల్యుయేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం
మన భారత్, హైదరాబాద్: తెలంగాణ  టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగం విద్యా రంగంలో మరో ముఖ్యమైన మార్పుకు శ్రీకారం చుట్టింది. విద్యార్థుల ఆన్సర్ షీట్ల మూల్యాంకనంలో (Valuation) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) వినియోగం కోసం అధికారులు ముందడుగు వేస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఈ పద్ధతిని పైలట్ ప్రాజెక్టుగా పాలిటెక్నిక్ స్దాయిలో రెండు సబ్జెక్టుల్లో అమలు చేయాలనే ప్రణాళిక సిద్ధమైంది.

అధికారుల సమాచారం మేరకు… పైలట్ దశలో AI సిస్టమ్‌ ద్వారా దిద్దిన పత్రాలను లెక్చరర్లు మరోసారి చెక్ చేయనున్నారు. ఇది విద్యార్థుల మార్కులపై ఎలాంటి లోపాలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు చెప్పిన టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారులు, AI ఆధారిత మూల్యాంకన విధానం సమయం ఆదా చేస్తుందని, మానవ తప్పిదాలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు.

అయితే విద్యార్థుల హస్తప్రతి ఒక్కొక్కరిది ఒక్కోలా ఉండటం వల్ల AI ఎలాంటి సవ్యమైన మూల్యాంకనం చేస్తుందన్న ఆసక్తి, సందేహాలూ పెరుగుతున్నాయి. రైటింగ్ స్టైల్, ప్రెజెంటేషన్, కంటెంట్ నాణ్యతను AI ఎంతవరకు ఖచ్చితంగా గుర్తిస్తుందో పైలట్ ప్రాజెక్టే తేలుస్తుందని అధికారులు తెలిపారు.

తెలంగాణలో మొదటిసారిగా జవాబు పత్రాల వాల్యుయేషన్‌లో AI ప్రవేశపెట్టనుండటం రాష్ట్ర విద్యా వ్యవస్థలో కీలక పరిణామంగా అభిలషిస్తున్నారు.

Latest articles

మన భారత్ “రిపోర్టర్” లే యజమానులు..!

రిపోర్టర్‌కు యజమాని హోదా: జర్నలిజంలో కొత్త మోడల్‌కు ‘మన భారత్’ శ్రీకారం మన భారత్, న్యూఢిల్లీ: ప్రస్తుత మీడియా రంగంలో...

🚆ఇక మొబైల్‌లో చూపించే రైల్వే టికెట్లు చెల్లవు..

🚆ఇక మొబైల్‌లో చూపించే రైల్వే టికెట్లు చెల్లవు.. రైల్వే కీలక నిర్ణయం మన భారత్, న్యూఢిల్లీ: ప్రయాణికుల టికెట్లను తనిఖీ చేస్తున్న...

అయ్యప్ప దీక్షలో స్నాన నియమాలు..

అయ్యప్ప దీక్షలో స్నాన నియమాలు: భర్తతో పాటు భార్య ధర్మ బాధ్యతలు ఏమిటి? మన భారత్, భక్తి: దీక్ష తీసుకొని...

అడిషనల్ కలెక్టర్ల లంచాల దందా..! సీఎం సీరియస్

అడిషనల్ కలెక్టర్ల లంచాల దందా..! సీఎం సీరియస్ మన భారత్, తెలంగాణ: భూ భారతి సమస్యల పరిష్కారంలో జిల్లాల స్థాయిలో...

More like this