నటి ప్రత్యూష మృతి కేసు మళ్లీ ఎఫ్‌ఐఆర్‌పై సుప్రీం కీలక తీర్పు రిజర్వ్
మన భారత్, హైదరాబాద్: తెలుగు టెలివిజన్ రంగాన్ని కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసు మరోసారి న్యాయస్థానాల గడప తొక్కింది. “తాను నిర్దోషినని” వాదిస్తున్న ప్రత్యూష ప్రియుడు సిద్ధార్థ్ రెడ్డిపై కఠిన శిక్ష విధించాలని కోరుతూ ఆమె తల్లి సరోజిని దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు వాదనలు పూర్తయ్యాయి. ఈ కేసుపై తుది తీర్పును apex కోర్టు రిజర్వ్ చేసింది.
💔 రెండు ప్రేమల… ఒకే విషాద ముగింపు
2002 ఫిబ్రవరి 23న హైదరాబాద్లో ఒకే గదిలో ప్రత్యూష, సిద్ధార్థ్ విషం సేవించిన ఘటన అప్పట్లో సంచలనమైంది. మరునాడు ప్రత్యూష ప్రాణాలు కోల్పోగా, సిద్ధార్థ్ ఆస్పత్రిలో చికిత్స పొంది బయటపడ్డాడు.
👩🦰 ‘నా కూతురు చనిపోవడానికి కారణం అతడే’ — తల్లి సరోజిని
ప్రత్యూష మరణానికి సిద్ధార్థ్ రెడ్డి బాధ్యుడని, అతడి ప్రవర్తనే ఆమెను ఈఘాతక నిర్ణయానికి నెట్టిందని ప్రత్యూష తల్లి ఆరోపిస్తూ కోర్టులలో న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తున్నారు.
సిద్దార్థ్‌ను కఠినంగా శిక్షించాలని, కేసులో మళ్లీ పునర్విమర్శించాలని ఆమె సుప్రీంకోర్టును కోరారు.
⚖️ ‘నన్ను తప్పుగా ముద్దాయిని చేశారు’ — సిద్ధార్థ్ వాదన
సిద్ధార్థ్ తనపై ఉన్న ఆరోపణలను కొట్టిపారేస్తూ… “ప్రత్యూషను నేను ప్రేమించాను. ఆత్మహత్య నిర్ణయం ఇద్దరం భావోద్వేగాల్లో తీసుకున్నాం. నాపై లేవనెత్తిన ఆరోపణలు తప్పుడు” అని వాదిస్తున్నారు.
🏛️ కీలక మలుపులో కేసు
రెండు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు తుది తీర్పును రిజర్వ్ చేసిన నేపథ్యంలో… ఈ 23 ఏళ్ల పాత కేసు ఏ దిశగా తిరుగుతుందో అన్న ఆసక్తి పెరిగింది.
