అవినీతి ఫిర్యాదులకు ఏసీబీనే భరోసా
ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక బ్యూరో సంప్రదింపు వివరాలు విడుదల
మన భారత్, అమరావతి:
రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు పౌరులు చురుకుగా భాగస్వామ్యం కావాలని ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక బ్యూరో (ACB) పిలుపునిచ్చింది. లంచాల డిమాండ్, అవినీతి చర్యలు, అక్రమ వ్యవహారాలపై తక్షణ చర్యలు తీసుకునేందుకు టోల్ ఫ్రీ నంబర్ సహా వాట్సాప్, ఇమెయిల్ సౌకర్యాలను ఏసీబీ అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణ ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయడానికి జిల్లాల వారీగా అధికారుల ఫోన్ నంబర్లు కూడా విడుదల చేశారు. ఎవరి భయపడకుండా అవినీతి ఘటనలను ధైర్యంగా తెలియజేయాలని ఏసీబీ అభ్యర్థించింది.
ఫిర్యాదులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు:
🔹 టోల్ ఫ్రీ: 1064
🔹 వాట్సాప్: 8333995858
🔹 ఇమెయిల్: dg_acb@ap.gov.in
జిల్లాల వారీగా ఏసీబీ సంప్రదింపు వివరాలు:
- కర్నూలు: డీఎస్పీ – 08518-273783 | 9440446178
- అనంతపురం: డీఎస్పీ – 08554-274170 | 9440446181
- నెల్లూరు: డీఎస్పీ – 0861-2331833 | 9440446184
- ఒంగోలు: డీఎస్పీ – 08592-232300 | 9440446189
- తిరుపతి: డీఎస్పీ – 08772-220252 | 9440446190
- కడప: డీఎస్పీ – 08562-244637 | 9440446191
- తూర్పు గోదావరి (రాజమండ్రి): 0883-2467833 | 9440446160
- కాకినాడ: 0884-2342785 | 9440446161
- ఏలూరు: 0881-2232017 | 9440446157
- విజయవాడ (కృష్ణా): 0866-2474140 | 9440446164
- గుంటూరు: 0863-2225850 | 9491305638
- విశాఖపట్నం: 0891-2552894 | 9440446170
- విజయనగరం: 08922-276404 | 9440446174
- శ్రీకాకుళం: 08942-222754 | 9440446124
ఏసీబీ అధికారులు ప్రజలను కోరుతూ—‘‘అవినీతి ఎక్కడ కనిపించినా వెంటనే ఫిర్యాదు చేయండి, మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి’’ అని తెలిపారు. రాష్ట్రాన్ని అవినీతి రహితంగా మార్చడానికి ప్రతి పౌరుడూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
