రాష్ట్ర దేవాలయాల్లో 324 ఉద్యోగాలు – త్వరలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్
మన భారత్, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో ఖాళీగా ఉన్న 324 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని దేవదాయ శాఖ రాష్ట్రవ్యాప్తం గా ఈవోలకు ఆదేశాలు జారీ చేసింది.
ఖాళీల వివరాలు, పోస్టుల విధులు, క్వాలిఫికేషన్, ఎంపిక విధానాలపై ఈవోలు ఇప్పటికే చర్యలు ప్రారంభించారని సమాచారం. ఆలయాల వారీగా ఉద్యోగాల జాబితా సిద్ధం చేయబడుతోంది. ప్రక్రియ పూర్తవగానే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు త్వరలోనే విడుదల కానున్నాయి.
ఉద్యోగార్థులు దేవదాయ శాఖ అధికారిక వెబ్‌సైట్ మరియు సంబంధిత దేవాలయాల ప్రకటనలను గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.
