ఆదిలాబాద్–భైంసాలో పత్తి కొనుగోలు సంక్షోభంపై కేటీఆర్ పర్యటన… రైతుల సమస్యలపై కీలక సమావేశాలు
మన భారత్, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నేటి (మంగళవారం) పర్యటనలో పత్తి కొనుగోళ్లలో నెలకొన్న సంక్షోభంపై ప్రత్యక్షంగా రైతుల సమస్యలను తెలుసుకోనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సమీక్షించేందుకు ఆయన ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో వరుస సభలు, మీడియా సమావేశాల్లో పాల్గొననున్నారు.
కేటీఆర్ షెడ్యూల్ (18.11.2025, మంగళవారం):
➡️ ఉదయం 6:30 గంటలకు – సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి బయలుదేరు.
➡️ ఉదయం 9:30 గంటలకు– ఆదిలాబాద్ మార్కెట్ యార్డు పర్యటన. పత్తి కొనుగోలు సమస్యలపై రైతులతో సమావేశం, ఇబ్బందులపై ప్రత్యక్ష అవగాహన. అనంతరం సభలో ప్రసంగం.
➡️ ఉదయం 11:00 గంటలకు – ఆదిలాబాద్ బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్.
➡️ మధ్యాహ్నం 2:00 గంటలకు – నిర్మల్ జిల్లా భైంసా మార్కెట్ యార్డు పర్యటన. పత్తి కొనుగోలు సంక్షోభంపై రైతుల అభిప్రాయాలు తెలుసుకొని మీడియా సమావేశంలో మాట్లాడుతారు.
రైతుల సమస్యలపై కేటీఆర్ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకునే అవకాశముంది. ఇటీవల పత్తి ధరలు పడిపోవడం, కొనుగోళ్లలో జాప్యం, CCI కఠిన ధోరణి వంటి అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ పర్యటన మరింత ముఖ్యమైంది.
#KTR #BRS #CottonCrisis #Adilabad #Nirmal #FarmersIssues #TelanganaPolitics #ManaBharath.Com
