వారణాసి సినిమా మహేశ్ బాబు ఫస్ట్ లుక్..

Published on

📰 Generate e-Paper Clip

మహేశ్ బాబు ‘వారణాసి’ నుంచి వరుస సర్ప్రైజులు – టైటిల్, ఫస్ట్ లుక్, గ్లింప్స్ అదిర్చే విజువల్ ట్రీట్

మన భారత్, వారణాసి: భారత సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాజమౌళి – మహేశ్ బాబు కాంబినేషన్ చిత్రం ‘వారణాసి’నుంచి ఒకేసారి పలు భారీ అప్డేట్‌లు బయటకు వచ్చాయి. Globe Trotter ఈవెంట్‌లో ఈ చిత్రానికి సంబంధించిన కీలక అంశాలను చిత్రబృందం అధికారికంగా విడుదల చేసింది.

ఈ సందర్భంగా మూవీ టైటిల్ ‘వారణాసి’, మహేశ్ బాబు ఫస్ట్ లుక్, అలాగే 3 నిమిషాలు 40 సెకన్ల గ్లింప్స్ వీడియోను ఆవిష్కరించగా, సోషల్ మీడియాలో ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది.

సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, ఈ చిత్రాన్ని 2027 సమ్మర్‌లో విడుదల చేయాలని నిర్ణయించామని ప్రకటించారు. విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, సెట్ నిర్మాణం వంటి అంశాలపై విస్తృతంగా పని జరుగుతోందని తెలిపారు.

దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి మాట్లాడుతూ, ఈ సినిమాలో రామాయణంలోని ఒక ప్రధాన ఘట్టాన్ని ఆధారంగా తీసుకున్నామని, అందుకే మహేశ్ బాబును రాముడి పాత్రలో డిజైన్ చేశామని వెల్లడించారు. మహేశ్ లుక్‌పై ప్రేక్షకుల్లో భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ నెలకొన్నాయి.

ఒకేసారి ఇన్ని అప్‌డేట్‌లు రావడంతో నెటిజన్లు “రాజమౌళి స్టైల్‌లో మెగా సర్ప్రైజ్ ప్యాకేజ్”, “హాలీవుడ్ రేంజ్ విజువల్స్” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Latest articles

కేజీబీవీ మెరిట్ లిస్ట్ విడుదల..!

కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి సవరించిన మెరిట్ లిస్ట్ విడుదల మన భారత్, మెదక్: మెదక్ జిల్లాలోని కస్తూర్భాగాంధీ...

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా.? 

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా?  సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తీవ్ర ఖండన మన భారత్, నారాయణపేట: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని...

ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌రాల కొనుగోలు చేస్తే తస్మాత్ జాగ్రత్త.!

మన భారత్, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ...

తుడుం దెబ్బ ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇంద్రకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ..

తుడుం దెబ్బ ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇంద్రకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అంబుగాం ఉప సర్పంచ్ ఆత్రం భరత్.. మన భారత్,...

More like this