డాక్టర్ డ్రెస్లో ఉగ్రవాది.. ఆత్మాహుతి దాడికి మాస్టర్‌మైండ్ అవతారం
స్టెతస్కోప్‌తో కనిపించిన జైషే మహమ్మద్ దుండగుడు ఉమర్ – భద్రతా సంస్థలు అలర్ట్
మన భారత్, ఢిల్లీ: దేశ భద్రతా వ్యవస్థను కుదిపేసిన ఆత్మాహుతి దాడి కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. బాంబ్ బ్లాస్ట్ కేసులో నిందితుడిగా ఉన్న జైషే మహమ్మద్ ఉగ్రవాది ఉమర్… డాక్టర్ డ్రెస్లో, మెడలో స్టెతస్కోప్‌తో కనిపించిన ఫొటో బయటకు రావడంతో సంచలనం రేగింది. ప్రజల మధ్య డాక్టర్ guiseలో తిరిగిన ఈ దుండగుడు, తన అసలు ఉద్దేశాలను ఏళ్ల తరబడి దాచినట్లు తెలుస్తోంది.
ఈ నెల 10న జరిగిన ఘోర ఆత్మాహుతి దాడిలో 13 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దాడి తరువాత దర్యాప్తు వేగం పెంచిన NIA, ఇతర భద్రతా సంస్థలు… ఉమర్ నెట్వర్క్, అతను పొందిన సహాయం, అతడి ప్లానింగ్ గురించి లోతుగా విచారణ జరుపుతున్నాయి.
ఉమర్ ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీలో వైద్యుడిగా పనిచేసి, డాక్టర్ గుర్తింపు కార్డు, యూనిఫారాన్ని ఉపయోగించి పర్యవేక్షణ నుండి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు అనుమానిస్తున్నారు. అతడి ఫొటో బయటకు రావడంతో యూనివర్సిటీ సిబ్బంది, పరిచయస్తులపై కూడా విచారణ జరగనుంది.
దాడి నేపథ్యం, ఉమర్ కార్యకలాపాలు, అతడి మైన్డ్-నెట్వర్క్ గురించి కీలక ఆధారాలు దొరకడంతో భద్రతా యంత్రాంగం అప్రమత్తమై, పలు రాష్ట్రాల్లో శోధనలు కొనసాగిస్తోంది.
