CM పీఠంపై సందిగ్ధం… రేపు JDU ఎమ్మెల్యేలతో నితీశ్ కీలక భేటీ
బిహార్‌లో NDA బంపర్ మెజారిటీ – అయితే సీఎం ఎవరు?
మన భారత్, పట్నా, నవంబర్ 15: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA విజయఢంకా మోగించినప్పటికీ, ముఖ్యమంత్రి పదవి పై ఇంకా స్పష్టత రాలేదు. మొత్తం 202 సీట్లతో సూపర్ మెజారిటీ సాధించిన కూటమిలో నాయకత్వంపై సందిగ్ధత నెలకొని ఉండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
ఈ నేపథ్యంలో సీఎం పీఠంపై తిరిగి అధిష్టానాన్ని ఆశిస్తున్న జేడీయూ అధినేత నితీశ్ కుమార్… రేపు ఆదివారం తన పార్టీ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. తద్వారా NDA భవిష్యత్ నాయకత్వంపై నిర్ణయం త్వరలోనే వెలువడే అవకాశాలు ఉన్నాయి.
“బిహార్‌ను ముందుకు నడిపించే సామర్థ్యం నితీశ్‌కే ఉంది. రాజకీయంగా, పరిపాలనా పరంగా ‘వివాదరహిత’ అభ్యర్థి ఆయన మాత్రమే. మా రాష్ట్రానికి ప్రత్యామ్నాయం లేరని” జేడీయూ ఎమ్మెల్యేలు ధృవీకరిస్తున్నారు.
ఫలితాల అనంతరం JDU కార్యాలయం, నితీశ్ నివాసం రాజకీయ నాయకులు, కార్యకర్తల రద్దీతో కిక్కిరిసిపోయింది. LJP నేత చిరాగ్ పాస్వాన్‌తో పాటు అనేకమంది నితీశ్‌ను కలిసి అభినందించారు. అయితే, NDA భాగస్వాములు ఎవరు ముఖ్యమంత్రిపీఠానికి మద్దతు ఇస్తారనే అంశం కీలకంగా మారింది.
బిహార్ రాజకీయాల్లో మరోసారి నాయకత్వ మార్పులు జోరందుకోవడంతో, రేపటి నితీశ్–ఎమ్మెల్యేల భేటీపై రాష్ట్ర వ్యాప్తంగా దృష్టి నిలిచింది.
