ప్రసవ నొప్పి తగ్గించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ‘ఎపిడ్యూరల్’ అందుబాటులోకి తేవాలి: జాగృతి నాయకురాలు కవిత
మన భారత్, నిజామాబాద్: ప్రసవ సమయంలో మహిళలు ఎదుర్కొనే తీవ్రమైన నొప్పిని తగ్గించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా ‘ఎపిడ్యూరల్’ సేవలను అందుబాటులోకి తేవాలని జాగృతి నాయకురాలు కవిత సూచించారు.
నిజామాబాద్‌లో నిర్వహించిన ” జనంబాట” (NLG) కార్యక్రమంలో మాట్లాడారు..“ప్రసవ సమయంలో ఆడబిడ్డలు భరించలేని నొప్పిని అనుభవిస్తారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాత్రం ‘ఎపిడ్యూరల్’ అనే మత్తు మందు ఇస్తారు. దాంతో మహిళలకు డెలివరీ సమయంలో నొప్పి తగ్గుతుంది.
ఇలాంటి సౌకర్యం ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా అందుబాటులో ఉండాలి” అని మంత్రి రాజనర్సింహను కోరారు.
తదుపరి ఆమె భావోద్వేగంగా మాట్లాడుతూ..“BRS పాలనలో నేను ఈ ఆలోచన చేయకపోవడం నా తప్పు. ఆడబిడ్డలు నన్ను క్షమించాలి” అని తెలిపారు.
కవిత వ్యాఖ్యలు మహిళా ఆరోగ్య రంగంలో చర్చనీయాంశమయ్యాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా ఎపిడ్యూరల్ సదుపాయం ఉంటే పేద మహిళలకు విపరీతమైన ఉపశమనం లభిస్తుందని వైద్యవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
