భారీ భద్రతా ఏర్పాట్లు.. 58 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో సీల్
మన భారత్, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఉపఎన్నిక పోలింగ్ నేడు జరుగనుంది.. మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్న ఈ ఎన్నికలో వేలాది మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు..
పోలింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు కఠిన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద సీసీటీవీ పర్యవేక్షణ, అదనపు పోలీసు బలగాల మోహరింపు చేపట్టారు. నగర పోలీసులు, ఎలక్టోరల్ ఆబ్జర్వర్లు సజావుగా ఓటింగ్ జరగడానికి చర్యలు తీసుకుంటారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 2.75 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో యువత, మహిళలు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తే సాయంత్రం వరకు 70 శాతం పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
అటు రాబోయే 14న కౌంటింగ్ జరగనుంది. ఆ రోజు ఫలితాలతో జూబ్లీహిల్స్ రాజకీయ సమీకరణాలు మారనున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
