2005 నుండి 2025 వరకు వరుస పేలుళ్లతో రాజధాని వణికిన దశాబ్దం
మన భారత్, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ భయానక పేలుళ్లకు వేదిక కావడం కొత్త విషయం కాదు. గత రెండు దశాబ్దాలుగా పలు సార్లు ఉగ్రదాడులు చోటుచేసుకుని వందలాది ప్రాణాలు బలయ్యాయి. తాజాగా జరిగిన ఎర్రకోట పేలుడు ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోవడంతో మళ్లీ రాజధానిపై భయాందోళనలు వ్యాపించాయి.
అక్టోబర్ 9, 2005 పేలుళ్లు:
దీపావళి పండుగ అనంతరం కేవలం రెండు రోజులకు, సాయంత్రం 5.38 గంటల నుంచి 6.05 గంటల మధ్య ఢిల్లీలో వరుస పేలుళ్లు సంభవించాయి. సరోజినీ నగర్, పహార్‌గంజ్, గోవింద్‌పుర ప్రాంతాల్లో బాంబులు పేలి రాజధానిని రణరంగంగా మార్చాయి. ఈ పేలుళ్లలో 67 మంది మృతులు, వందలాది మంది గాయపడ్డారు.
సెప్టెంబర్ 13, 2008 పేలుళ్లు:
ఆ రోజు సాయంత్రం 6.27 గంటలకు పోలీసులు “ఇండియన్ ముజాహిదీన్” పేరిట వచ్చిన ఈమెయిల్ అందుకున్నారు. కానీ దానికి స్పందించేలోపే రాజధానిలో ఐదు ప్రాంతాల్లో తొమ్మిది వరుస పేలుళ్లు జరిగాయి. కనాట్ ప్లేస్, గ్రేటర్ కైలాశ్, గోకుల్‌పురి వంటి ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో 25 మంది ప్రాణాలు కోల్పోయారు.
నవంబర్ 10, 2025 – ఎర్రకోట పేలుడు:
తాజాగా ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు దాడిలో 13 మంది మృతులు, పలువురు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో మరోసారి ఢిల్లీలో భద్రతా లోపాలపై ప్రశ్నలు తలెత్తాయి.
ఇంతకుముందు జరిగిన ఈ దాడులన్నీ దేశ భద్రతా వ్యవస్థను కుదిపేసిన సంఘటనలుగా చరిత్రలో నిలిచిపోయాయి. ప్రస్తుతం కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది.
