వివోఏలకు ఉల్లాస్ శిక్షణ తరగతులు ప్రారంభం
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చడమే లక్ష్యం
మన భారత్, తాంసీ, నవంబర్ 10: మండలంలోని ఐకేపీ భవనంలో వీవోఏలకు (VOA) నవభారత్ సాక్షరత ఉల్లాస్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ ప్రధానంగా 15 ఏళ్లు పైబడిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చి సుజ్ఞాన సమాజ నిర్మాణం దిశగా అడుగులు వేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ సందర్భంగా సీఆర్పీ శోభారాణి మాట్లాడుతూ.. మహిళల చదువుతోనే కుటుంబ, సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి వీవోఏ సాక్షరత కార్యక్రమాన్ని ప్రజల్లో విస్తృతంగా చాటిచెప్పి, గ్రామ స్థాయిలో నిరక్షరాస్యులను గుర్తించి వారికి అక్షరాభ్యాసం కల్పించాల్సిన అవసరాన్ని ఆమె వివరించారు.
ఈ కార్యక్రమంలో సీఆర్పీ రాజవర్ణ, ఏపీఎం భాగవాండ్లు, సీసీ మహేందర్, గ్రామైక్య సంఘాల లీడర్లు పాల్గొన్నారు. శిక్షణలో పాల్గొన్న వీవోఏలకు సాక్షరత కార్యక్రమాల ప్రాముఖ్యత, అమలు విధానాలపై అవగాహన కల్పించారు.
