భక్తి ఊరేగింపు.. పొన్నారిలో బాజీరావు బాబా పుణ్యార్థం పల్లకి యాత్ర ఘనంగా..
మన భారత్ ఆదిలాబాద్ ,నవంబర్ 10: ఆధ్యాత్మిక భక్తి తరంగాలతో తాంసీ మండలం పొన్నారి గ్రామం మార్మోగింది. బాజీరావు బాబా పుణ్యతిథి సందర్భంగా గ్రామ భక్తులు భక్తి భావంతో పల్లకి యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు నృత్యాలు చేస్తూ, భజన గీతాలను పలుకుతూ పురవీధుల్లో ఊరేగారు. పల్లకి యాత్రలో పాల్గొన్న భక్తులు బాజీరావు బాబా కీర్తనలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు.
బాజీరావు బాబా పట్ల భక్తుల ప్రేమాభిమానాలు వ్యక్తమయ్యాయి. పల్లకి యాత్రలో చిన్నా పెద్దా అందరూ పాల్గొని పల్లెలో పండుగ వాతావరణాన్ని సృష్టించారు.
సాంప్రదాయ వాద్యాల నినాదాలు, భక్తుల నృత్యాలు, కీర్తనలతో పొన్నారి గ్రామం ఆధ్యాత్మిక క్షేత్రంగా మారిపోయింది. భక్తులు బాబా చరిత్రను స్మరించుకుంటూ ఆయన ఆశీర్వాదం కోరారు.
బాజీరావు బాబా పుణ్యతిథి సందర్భంగా భక్తి తరంగాలతో పొన్నారి మార్మోగింది.
ఈ కార్యక్రమంలో వెంకన్న మహారాజ్, బాజీరావు మహారాజ్ భక్తులు బాస నర్సయ్య, నారాయణ, రాకేష్, శ్రీనివాస్, స్వామి, అండె లింగన్న, గంగన్న, ఊశన్న, వసంత్, మహేందర్, పోతన్న తదితరులు పాల్గొన్నారు.
