జాగృతి జనం బాటలో కవిత..

Published on

📰 Generate e-Paper Clip

ఆదిలాబాద్ జిల్లాలో పర్యటన రెండవ రోజు సందడి!

మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 4:
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదిలాబాద్ జిల్లాలో “జాగృతి జనం బాట” కార్యక్రమాన్ని రెండవ రోజూ ఉత్సాహంగా కొనసాగిస్తారని జాగృతి నాయకులు రంగినేని శ్రీనివాస్ తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాలతో సమానంగా కలవాలని లక్ష్యంగా ఆమె పర్యటనలో పలు కీలక సమావేశాలు, కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు.

ఉదయం 9 గంటలకు ఆదిలాబాద్ పట్టణంలోని తనిష్క్ హోటల్‌లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం 9:30 గంటలకు హోటల్ సాయి పంచవటిలో జిల్లా మేధావులు, విద్యావంతులతో ఆమె ప్రత్యేకంగా చర్చించనున్నారు. సమాజ అభివృద్ధి, యువత పాత్ర, మహిళా సాధికారత వంటి అంశాలపై ఆమె అభిప్రాయాలు పంచుకునే అవకాశం ఉంది.

మధ్యాహ్నం 12 గంటలకు ద్వారకా నగర్లో తెలంగాణ జేఏసీ చైర్మన్ దామోదర్ ఆధ్వర్యంలో ఉద్యమకారుల సమావేశం జరగనుంది. తెలంగాణ సాధనలో భాగస్వాములైన ఉద్యమ వీరులను కవిత కలుసుకోనున్నారు.

తదుపరి 2 గంటలకు ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబా ఆలయాన్ని (కేస్లాపూర్, ఇంద్రవెల్లి మండలం) సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. 3 గంటలకు ఇంద్రవెల్లి అమరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తారు. అనంతరం 3:30 గంటలకు ఐటీడీఏ, ఉట్నూర్లో ఆదివాసీ మహిళల వర్క్‌షాప్‌ను పరిశీలించనున్నారు.

ఈ సందర్భంగా జాగృతి నాయకుడు రంగినేని శ్రీనివాస్ మాట్లాడుతూ “జాగృతి జనం బాటలో కవిత  పర్యటన ప్రజల్లో విస్తృత స్పందన కలిగిస్తోంది. ప్రతి గ్రామంలో ఆమెకు ఉత్సాహపూరిత స్వాగతం లభిస్తోంది,” అని తెలిపారు.

Latest articles

సాయి కిరణ్ కు ఘన సన్మానం..

యూపీఎస్సీలో పొన్నారి యువకుడి సత్తా – సాయి కిరణ్‌కు ఘన సన్మానం మన భారత్, ఆదిలాబాద్ : జిల్లా తాంసి...

జర్నలిస్టులకు త్వరలో అక్రిడిటేషన్ కార్డులు..

జర్నలిస్టులకు త్వరలో అక్రిడిటేషన్ కార్డులు: మంత్రి పొంగులేటి స్పష్టం మన భారత్, హైదరాబాద్: జర్నలిస్టుల చిరకాల వాంఛలైన అక్రిడిటేషన్ కార్డులు,...

కోడి గుడ్ల ధరలకు రెక్కలు..

కోడి గుడ్ల ధరలకు రెక్కలు… ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి చేరిన రేట్లు మన భారత్, హైదరాబాద్: కోడి గుడ్డు ధరలు సామాన్యుడికి...

విజయోత్సవ ర్యాలీ విజయవంతం చేయాలి..

జామిడి గ్రామంలో సర్పంచ్ ప్రమాణ స్వీకారం, విజయోత్సవ ర్యాలీకి సన్నాహాలు మన భారత్, ఆదిలాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో అఖండ మెజారిటీతో...

More like this