రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
మన భారత్, మెదక్ జిల్లా, నవంబర్ 2: రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో ఆదివారం ఐకెపి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐకెపి నిర్వాహకురాలు కమ్మరి శ్యామల మాట్లాడుతూ, రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ధాన్యాన్ని ప్రభుత్వ కేంద్రాలకు తరలించాలని సూచించారు.
దళాలకు విక్రయిస్తే నష్టపోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. ప్రభుత్వం రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని న్యాయమైన ధరలు అందించే విధంగా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. రైతులు ధాన్యం తూకం, తేమ శాతం తదితర అంశాలను ఖచ్చితంగా పరిశీలించి కేంద్రంలోనే విక్రయించాలన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సర్దార్ నాయక్, కమ్యియా, బాబు, భాస్కర్, దుర్గ, క్షత్రియ, పొమ్య, సుభాష్ తండా నాయకులు పాల్గొన్నారు. గ్రామంలో రైతులు ఈ కేంద్రం ప్రారంభాన్ని హర్షంగా స్వాగతించారు.
