ప్రత్యేక ప్రధాన సలహాదారునిగా నియామకంపై సుదర్శన్ రెడ్డికి ఘన సన్మానం 

Published on

ప్రత్యేక ప్రధాన సలహాదారునిగా నియామకంపై సుదర్శన్ రెడ్డికి ఘన సన్మానం 

మన భారత్, హైదరాబాద్, నవంబర్ 1:
బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన సలహాదారునిగా క్యాబినెట్ హోదాతో నియమితులైన నేపథ్యంలో అభినందనల వెల్లువ కొనసాగుతోంది. ఈ నియామకంపై శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో బోధన్ పట్టణ ప్రముఖులు, ట్రస్మా సభ్యులు ఘనంగా సత్కరించారు.

సుదర్శన్ రెడ్డిని శాలువా కప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానించిన ప్రముఖులు, “బోధన్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం సుదర్శన్ రెడ్డి కొత్త బాధ్యతల్లో మరింత కృషి చేస్తారని ఆశిస్తున్నాం,” అన్నారు.

ప్రముఖులు మాట్లాడుతూ, ఆయన కృషితో బోధన్ పట్టణం అభివృద్ధి దిశగా నడుస్తోందని, ప్రజల సమస్యలను సమర్థంగా పరిష్కరిస్తున్నారని ప్రశంసించారు. “రాష్ట్ర అభివృద్ధికి విలువైన సూచనలు అందించే నాయకుడు సుదర్శన్ రెడ్డి,” అని పేర్కొన్నారు.

తమ నాయకుడిని ప్రభుత్వ సలహాదారుగా నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధి బసవేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకుడు నరసింహ రెడ్డి, నిజామాబాద్ జిల్లా ట్రస్మా అధ్యక్షులు కొడాలి కిషోర్, గౌరవ సలహాదారులు యార్లగడ్డ శ్రీనివాస్, చక్రవర్తి, ట్రస్మా పట్టణ కమిటీ సభ్యులు హరికృష్ణ, దుష్యంత్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Latest articles

గురు రవిదాస్ జయంతి వేడుకల్లో సుకుమార్ పెట్కులేకు ఘన సన్మానం

మన భారత్, నాందేడ్: నాందేడ్ జిల్లా కేంద్రంలో విశ్వగురు సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సాహిత్య సమ్మేళన...

ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అనూష బండారి ఎన్నిక

ఉత్కంఠకు తెర – స్వతంత్ర అభ్యర్థికి విస్తృత మద్దతు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది....

10 నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మన భారత్, కేరళ: కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో...

ఆదిలాబాద్ 43వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి కలాల్ శ్రీనివాస్ విజయం

ప్రధాన పార్టీలకు షాక్ – 323 ఓట్ల భారీ మెజారిటీ మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో...

More like this