తాంసి ప్రభుత్వ జూనియర్ కళాశాల NSS ప్రత్యేక శిబిరానికి వామన్ నగర్ గ్రామంలో ప్రారంభం
మన భారత్, ఆదిలాబాద్: ప్రభుత్వ జూనియర్ కళాశాల NSS యూనిట్ ఆధ్వర్యంలో 7 రోజుల ప్రత్యేక శిబిరం శుక్రవారం వామన్ నగర్ గ్రామంలో ప్రారంభమైంది. గ్రామంలో నిర్వహించిన ప్రారంభ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ కె. సుదర్శన్ సర్, గ్రామ పెద్దలు విష్ణు, మారుతి పటేల్, భూమన్న తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సుదర్శన్ మాట్లాడుతూ .. “NSS వాలంటీర్లు సామాజిక సేవా దృక్పథంతో పనిచేస్తూ గ్రామీణాభివృద్ధి, స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. విద్యార్థులు సమాజానికి ఆదర్శంగా నిలవాలి” అని సూచించారు.
అతిథులు మాట్లాడుతూ విద్యార్థుల్లో జాతీయ సమైక్యత, సామాజిక బాధ్యతా భావం, సేవాస్ఫూర్తి పెంపొందించడం NSS ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు సామాజిక సేవ, ఆరోగ్యం, విద్య, పర్యావరణ పరిరక్షణ, గ్రామాభివృద్ధి వంటి అంశాలపై అవగాహన కల్పించబడింది.
తదుపరి NSS వాలంటీర్లు గ్రామ ప్రజల్లో పరిశుభ్రత, చెట్ల నాటకం, మత్తు పదార్థాల వ్యసన నిషేధం, విద్య ప్రాధాన్యత పై అవగాహన కల్పించే ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్. సంతోష్, అధ్యాపకులు జె. మల్లేష్, బి. ప్రవీణ్, మరియు NSS వాలంటీర్లు పాల్గొన్నారు.
