తేమ శాతం పేరుతో రైతులను దోచుకుంటున్న ప్రభుత్వాలు

Published on

మన భారత్, ఆదిలాబాద్: రైతులను దోచుకోవడం తప్ప ప్రభుత్వాలకు వేరే పనిలేదు” అని భారతీయ సంఘ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భూమా రెడ్డి  తీవ్రంగా మండిపడ్డారు. గురువారం తాంసి మండల కేంద్రంలో భారతీయ సంఘ్ ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై ధర్నా నిర్వహించారు. అనంతరం మండల తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా భూమా రెడ్డి మాట్లాడుతూ, “సీసీఐ సంస్థలు పత్తి కొనుగోళ్లలో రైతులను నష్టపరుస్తున్నాయి. తేమ శాతం పేరుతో పత్తి బేళ్లను తిరస్కరించడం అన్యాయం. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని కనీసం 18 శాతం తేమతో పత్తి కొనుగోలు చేయాలని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు.

రైతులు ఎండవానల మధ్య కష్టపడి పంటను పండిస్తే, ప్రభుత్వ విధానాల కారణంగా వారికి న్యాయం దొరకడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీసీఐ అధికారులు రైతులకు మేలు చేసే విధంగా కొనుగోలు ప్రమాణాలను మార్చాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు కేతి రెడ్డి కృష్ణ రెడ్డి, జిల్లా కార్యదర్శి అడేపు శ్రీనివాస్, తాంసి మాజీ సర్పంచ్ స్వప్న రత్న ప్రకాష్, ఇతర రైతులు పాల్గొని ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Latest articles

హాస్టళ్లలో 1,433 పోస్టుల భర్తీ.. అసెంబ్లీలో మంత్రి సవిత ప్రకటన

మన భారత్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 1,433 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో...

అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్

మన భారత్, జైనథ్: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...

పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు.. భారీ వాహనాలకు నో ఎంట్రీ

మన భారత్, ఆదిలాబాద్: పట్టణంలోని తాంసి బస్టాండ్ సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్...

More like this