మన భారత్, మెదక్: మెదక్ జిల్లా రెవెన్యూ సిబ్బంది ప్రజలకు మరింత అందుబాటులో ఉండి, వేగవంతమైన సేవలు అందించాలని ఆర్టీవో రమాదేవి సూచించారు. బుధవారం ఆమె రామాయంపేట తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె, “ప్రజా సమస్యల పరిష్కారం ప్రభుత్వ పరిపాలనలో ప్రధాన భాగం. అందుకే ప్రతి దరఖాస్తును సమయానికి పరిష్కరించి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి” అని సూచించారు. భూభారతి రెవెన్యూ సదస్సులో పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు రెవెన్యూ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆమె ఆదేశించారు. “ఎన్నికల బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించేలా ముందుగానే సన్నాహాలు చేయాలి” అని ఆర్టీవో రమాదేవి తెలిపారు. విధులకు గైర్హాజరు కాకుండా సమయ పాలన పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రజనీకుమారి పాల్గొన్నారు. అధికారులు, సిబ్బంది తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆమె సూచించారు.
