Published on

108 వాహనంలో ప్రసవించిన మహిళ ..

మన భారత్ ఆదిలాబాద్తాంసీ మండలంలోని గిరిగామ గ్రామానికి చెందిన యశోద బుధవారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అంబులెన్స్ సిబ్బంది గ్రామానికి చేరుకుని ఆమెను రిమ్స్ ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యంలోనే యశోదకు పురిటి నొప్పులు ముదిరిపోవడంతో అంబులెన్స్‌లోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 108 సిబ్బంది చాకచక్యంగా స్పందించి తల్లి, శిశువుకు అవసరమైన వైద్య సహాయం అందించారు. ఈ సంఘటనపై 108 ఈఎంటీ వంశీ మాట్లాడుతూ.. “మాకు సమాచారం అందగానే వెంటనే వెళ్లి రోగిని ఆస్పత్రికి తరలించాం. మార్గమధ్యంలోనే ప్రసవం జరగడంతో తల్లి, శిశువును సురక్షితంగా ప్రసవింపజేశాం” అని తెలిపారు. పైలట్ పోచ్చన్న మాట్లాడుతూ, “తల్లి, బిడ్డను మెరుగైన చికిత్స కోసం రిమ్స్ ఆస్పత్రికి చేర్చాం. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగా ఉన్నారు” అని తెలిపారు. ఈ ఘటనపై గ్రామస్థులు 108 సిబ్బందిని ప్రశంసిస్తూ వారి సేవాభావాన్ని కొనియాడారు.

మన భారత్ ప్రత్యేక ప్రతినిధి – ఆదిలాబాద్

Latest articles

గుబిడి భజన పోటీల్లో 12వ వార్డు భజన మండలి ప్రతిభ..

మన భారత్, ఆదిలాబాద్: గుబిడి గ్రామంలో నిర్వహించిన భజన పోటీలలో 12వ వార్డుకు చెందిన శ్రీ రమా సహిత సత్యనారాయణ...

గురు రవిదాస్ జయంతి వేడుకల్లో సుకుమార్ పెట్కులేకు ఘన సన్మానం

మన భారత్, నాందేడ్: నాందేడ్ జిల్లా కేంద్రంలో విశ్వగురు సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సాహిత్య సమ్మేళన...

ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అనూష బండారి ఎన్నిక

ఉత్కంఠకు తెర – స్వతంత్ర అభ్యర్థికి విస్తృత మద్దతు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది....

10 నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మన భారత్, కేరళ: కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో...

More like this