గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తాం – మల్లెపూల నర్సయ్య

Published on

📰 Generate e-Paper Clip

గ్రంథాలయాన్ని సందర్శించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సయ్య 

మన భారత్, ఆదిలాబాద్, అక్టోబర్ 28 : ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య మంగళవారం నేరడిగొండ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ గ్రంథాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలోని రిజిస్టర్లను పరిశీలించి, ప్రతిరోజూ ఎంతమంది పాఠకులు వస్తున్నారో, పుస్తకాలు అందుబాటులో ఉన్నాయా లేదా అనే అంశాలను గ్రంథాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని తన దృష్టికి తీసుకురావాలని సిబ్బందిని కోరారు. నిరుద్యోగులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే, విద్యార్థులకు గ్రంథాలయంలోనే ప్రశాంత వాతావరణంలో చదువుకునే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. తరువాత చైర్మన్ మల్లెపూల నర్సయ్యకు గ్రంథాలయ సిబ్బంది, స్థానిక నాయకులు శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బొడ్డు గంగా రెడ్డి, ఉపాధ్యక్షుడు ఆడే వసంత్ రావు, సీనియర్ నాయకులు ఏలేటి రాజశేఖర్ రెడ్డి, అనుపట్ల సంజీవ్, గట్టు అశోక్, రమేష్, యువ నాయకులు యండి సద్దాం, లైబ్రరీయన్ శ్రీకాంత్, గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Latest articles

పోరండ్ల సంతోష్ అను నేను.. దేవాపూర్ సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న..

దేవాపూర్ గ్రామ సర్పంచ్‌గా సంతోష్ ప్రమాణ స్వీకారం మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామానికి నూతన సర్పంచ్‌గా...

కజ్జర్ల సర్పంచ్‌గా ఎల్మ నారాయణరెడ్డి ప్రమాణ స్వీకారం..

గ్రామాభివృద్ధే ధ్యేయం.. కజ్జర్ల సర్పంచ్‌గా ఎల్మ నారాయణరెడ్డి ప్రమాణ స్వీకారం మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామానికి...

మర్రి చెట్టు నీడలో ప్రమాణ స్వీకారం..

మర్రి చెట్టు నీడలో ప్రజాస్వామ్య ప్రమాణం.. సకినాపూర్ సర్పంచ్‌గా నికిత నగేష్ ప్రమాణ స్వీకారం మన భారత్, ఆదిలాబాద్: తలమడుగు...

సాయి కిరణ్ కు ఘన సన్మానం..

యూపీఎస్సీలో పొన్నారి యువకుడి సత్తా – సాయి కిరణ్‌కు ఘన సన్మానం మన భారత్, ఆదిలాబాద్ : జిల్లా తాంసి...

More like this