ప్రకృతి ఒడిలో పచ్చని పూలదండలా మెరిసే సోయగం

Published on

జిల్లా కలెక్టర్ రాజర్షి షా కృషి.. వాగు అందాలు కమనీయం

 మన భారత్, ఆదిలాబాద్ : తాంసి గ్రామ పరిసరాల్లో ప్రవహించే మత్తడి వాగు ప్రకృతి సోయగాలతో కన్ను తిప్పుకోనీయకుండా మురిపిస్తోంది. వాగు ఒడ్డున పచ్చని చెట్లు, నీలి ఆకాశం ప్రతిబింబమై నీటిపై అలరారుతూ అపూర్వ దృశ్యాన్ని సృష్టిస్తున్నాయి. ఇటీవలి వర్షాలతో వాగు నీటిమట్టం పెరగడంతో పరిసరాలు మరింత పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఈ వాగు తీరానకు వచ్చే గ్రామస్థులు, పర్యాటకులు ఆ అందాలను ఆస్వాదిస్తూ సేద తీరుతున్నారు. నిశ్శబ్ద వాతావరణం, పక్షుల కిలకిలరాగాలు కలగలసి ఆ ప్రదేశాన్ని సహజమైన నేచర్ స్పాట్గా మార్చేశాయి.మాజీ సర్పంచ్ స్వప్న రత్న ప్రకాష్ మాట్లాడుతూ.. “మత్తడి వాగు ఎప్పుడూ మా గ్రామానికి ప్రాణాధారం. పంటల సాగు, తాగునీటి అవసరాలు మాత్రమే కాదు, ఇప్పుడు ప్రకృతి అందాలతో పర్యాటకులను కూడా ఆకర్షిస్తోంది” అని తెలిపారు.

జిల్లా కలెక్టర్ రాజర్షి షా సహాకారంతో పూడికతీత పనులు చేపట్టడంతో మళ్లీ మత్తడి వాగు పూర్వ వైభవం సంతరించుకుంది. మండుటెండలకు నీరు లేక తల్లడిల్లిన మత్తడి వాగు సమస్యను భూ భారతి సమయంలో జిల్లా కలెక్టర్ దృష్టికి మాజీ సర్పంచ్ గ్రామస్తులతో కలిసి తీసుకువెళ్లడంతో సమస్య తీరింది. జిల్లా కలెక్టర్ సహకారంతో రూ.3 లక్షల 50 వేల తో పూడికతీత పనులు చేపట్టారు. ప్రకృతి సోయగాలను కాపాడుతూ, పర్యావరణ పరిరక్షణకు గ్రామస్థులు కృషి చేయాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు. తాంసి మత్తడి వాగు నిజంగా ప్రకృతి ఒడిలో సొగసైన ఆభరణంలా మెరుస్తోంది.

Latest articles

హాస్టళ్లలో 1,433 పోస్టుల భర్తీ.. అసెంబ్లీలో మంత్రి సవిత ప్రకటన

మన భారత్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 1,433 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో...

అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్

మన భారత్, జైనథ్: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...

పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు.. భారీ వాహనాలకు నో ఎంట్రీ

మన భారత్, ఆదిలాబాద్: పట్టణంలోని తాంసి బస్టాండ్ సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్...

More like this