సీసీఐ కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ

Published on

రైతుల కంట కన్నీళ్లు రానీయకుండా చూస్తామన్న ఎంపీ

గజ్వేల్, అక్టోబర్ 27: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల పరిధిలోని సాయి బాలాజీ కాటన్ ఇండస్ట్రీలో సోమవారం సిసిఐ (CCI) కొనుగోలు కేంద్రాన్ని మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి లు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ రఘునందన్ రావు రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.“రైతులు కష్టపడి పండించిన పత్తిని అమ్ముకునే సమయంలో కంట కన్నీళ్లు రాకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత” అని ఎంపీ స్పష్టం చేశారు. రైతులు తమ పత్తిని ఎక్కడో దూర ప్రాంతాలకు తరలించకుండా, వారికి సౌకర్యంగా ఉండేలా దగ్గర్లోనే సిసిఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, “గతంలో పత్తి ధర క్వింటాల్‌కు రూ.4 వేల రూపాయల పరిధిలో ఉండేది. కానీ నరేంద్ర మోదీ హయాంలో రైతు ఆదాయం పెరిగేలా కనీస మద్దతు ధర (MSP)ను రెట్టింపు చేస్తూ రూ.8,110 వరకు పెంచాం” అని వివరించారు. అదే సమయంలో దళారి వ్యవస్థను నిర్మూలించి, రైతులను దోపిడీ నుంచి కాపాడే చర్యలు తీసుకుంటామని చెప్పారు. “ఏదైనా కేంద్రంలో రైతులను ఇబ్బంది పెడితే, వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి. ప్రభుత్వం రైతుల పక్షాన నిలుస్తుంది” అని ఎంపీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, సిసిఐ ప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఎంపీ రైతులతో మాట్లాడుతూ వారి సమస్యలు, సూచనలు తెలుసుకున్నారు.

– మన భారత్, గజ్వేల్ ప్రతినిధి

Latest articles

10 నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మన భారత్, కేరళ: కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో...

ఆదిలాబాద్ 43వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి కలాల్ శ్రీనివాస్ విజయం

ప్రధాన పార్టీలకు షాక్ – 323 ఓట్ల భారీ మెజారిటీ మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో...

ఆదిలాబాద్ 34వ వార్డులో 12 ఓట్ల తేడాతో ఎంఐఎం విజయం  ఉత్కంఠభరిత పోరులో షేక్ నజీర్ అహ్మద్ గెలుపు

మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 34వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి షేక్ నజీర్ అహ్మద్ హోరాహోరీగా...

ఆదిలాబాద్ 22వ వార్డులో ఎంఐఎం ఘన విజయం..

313 ఓట్ల మెజారిటీతో సమీనా బేగం గెలుపు మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 22వ వార్డులో...

More like this