ఆదిలాబాద్ పర్యటనకు సిద్ధమైన జాగృతి అధ్యక్షురాలు కవిత.. నవంబర్ 3, 4న ‘జాగృతి జనం బాట’ కార్యక్రమంలో పాల్గొననున్నారు
మన భారత్, ఆదిలాబాద్: తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నవంబర్ 3, 4 తేదీల్లో ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ‘జాగృతి జనం బాట’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పలు మండలాలను సందర్శించి, మేధావులు, ఉద్యమకారులు, విద్యార్థులు, యువతతో భేటీ కానున్నారు. ఈ వివరాలను జాగృతి జిల్లా అధ్యక్షుడు రంగినేని శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. కవిత పర్యటన సందర్భంగా జాగృతి కార్యకర్తలతో సమావేశమై, సంస్థ భవిష్యత్ కార్యకలాపాలపై సూచనలు ఇవ్వనున్నారని ఆయన చెప్పారు. జిల్లాలో ఎక్కడా కొత్త కమిటీలు ఏర్పాటు కాలేదని, ఇప్పటికే ఉన్న పాత కమిటీ లే కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. కవిత పర్యటనతో ఆదిలాబాద్ జాగృతి కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొన్నదని ఆయన పేర్కొన్నారు. కవిత పర్యటన విజయవంతం కావడానికి జాగృతి సభ్యులు, నాయకులు ఇప్పటికే ఏర్పాట్లను ప్రారంభించినట్లు సమాచారం.
