కుంటాల గ్రామంలో సంతోష్ కుటుంబాన్ని పరామర్శించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
మన భారత్ ఆదిలాబాద్: నేరడిగొండ మండలంలోని కుంటాల గ్రామానికి చెందిన జాదవ్ సంతోష్ తల్లి ఇటీవల మృతిచెందిన సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదివారం వారి ఇంటిని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతురాలి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే, కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
ఈ కష్ట సమయంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున తమ సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. సంతోష్ కుటుంబాన్ని ఓదార్చుతూ, కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామస్థులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మానవతా విలువలను మెచ్చుకున్నారు.
