e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమష్టి కృషి..

ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమష్టి కృషి అవసరం

మన భారత్, విజయనగరం:

ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం–2026 సందర్భంగా విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో ఐసీడీఎస్, కార్మిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాల నివారణ వంటి కీలక అంశాలపై నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణ రాజు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి ఏ. కృష్ణప్రసాద్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ప్రసాదరావు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే యూత్ క్లబ్ బెజ్జిపురం ఎన్జీవో ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, బాల కార్మిక వ్యవస్థ సమాజ అభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారిందన్నారు. ప్రతి బాలుడు విద్యను అభ్యసించే హక్కును కలిగి ఉన్నాడని, చిన్నారులను పనుల్లో నిమగ్నం చేయడం వారి భవిష్యత్తును దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. బాలల హక్కులను పరిరక్షించడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని తెలిపారు.

రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణ రాజు మాట్లాడుతూ, బాల కార్మికులను గుర్తించి వారిని విద్యావ్యవస్థలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. బాలలపై జరిగే అన్యాయాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి ఏ. కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, బాలల హక్కుల పరిరక్షణకు చట్టాలు ఉన్నప్పటికీ వాటి అమలులో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ వంటి సామాజిక సమస్యలను పూర్తిగా నిర్మూలించాలంటే అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ నెట్‌వర్క్ సహకారంతో జిల్లాలో బాల కార్మికులను గుర్తించి, రెస్క్యూ చేసి, పునరావాసం కల్పించే కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని యూత్ క్లబ్ బెజ్జిపురం ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం. ప్రసాదరావు తెలిపారు. చిన్నారుల భవిష్యత్తు కోసం తమ సంస్థ నిరంతరం పనిచేస్తోందని, బాలల సంక్షేమానికి అన్ని వర్గాల సహకారం అవసరమని పేర్కొన్నారు.

అన్ని ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడం సాధ్యమవుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు. బాలల విద్య, ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమం ముగింపులో బాలల హక్కుల పరిరక్షణకు సంబంధించిన ప్రతిజ్ఞ చేయించి, సమాజంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE