వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్ట్

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్

విద్యానగర్‌లో చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం

ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని విద్యానగర్ ప్రాంతంలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని 2 టౌన్ సీఐ నాగరాజు వెల్లడించారు.

పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ప్రత్యేక బృందం విద్యానగర్ ప్రాంతంలోని ఓ నివాస గృహంపై దాడులు నిర్వహించింది. తనిఖీల్లో అక్కడ వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు నిర్వాహకురాలు సరిత, ఆమె కుమారుడు విశాల్, అలాగే విటుడిగా ఉన్న షేక్ నదీంలను అదుపులోకి తీసుకున్నారు.

నిందితులపై సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసి, అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ సందర్భంగా సీఐ నాగరాజు మాట్లాడుతూ, సమాజానికి హానికరమైన చట్టవ్యతిరేక కార్యకలాపాలపై పోలీసు శాఖ నిరంతరం నిఘా ఉంచుతుందని అన్నారు. వ్యభిచారం, అక్రమ రవాణా, మాదకద్రవ్యాల విక్రయాలు వంటి నేర కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

కేసీఆర్ కుటుంబంపై మెరుగు సురేష్ గౌడ్ ఫైర్ 

మొగుళ్ళపల్లి సెప్టెంబర్ 21, (మన భారత్): తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్రోలుకు, డీజిల్ కు కూడా పైసలు లేవన్న వాళ్లు,...

ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

51 శాతం ఫిట్‌మెంట్‌తో వెంటనే పీఆర్సీ ప్రకటించాలి.. పెండింగ్‌ డీఏలు విడుదల చేయాలి: తపస్‌ జిల్లా అధ్యక్షుడు సునీల్‌...

విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధికి బోధనోపకరణాలు దోహదం

తలమడుగులో మండల స్థాయి బోధనోపకరణాల మేళా తహసీల్దార్ బి. రాజమోహన్ మన భారత్, తలమడుగు, సెప్టెంబర్ 21: విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచనా...

త్రిషల్ గణేష్ మండలిలో ప్రత్యేక పూజలు..

మన భారత్, సెప్టెంబర్21, మావల: మావలలోని త్రిషల్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన శ్రీ వినాయకుడిని ఆదిలాబాద్ మార్కెట్...

More like this