తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక రాష్ట్రం..

Published on

-Advertisement-

తలమడుగులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ చేసి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు , ఎన్నో ఏళ్ల ఉద్యమాలు, పోరాటాలు, అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ప్రత్యేక రాష్ట్రం నేడు దేశవ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఇంకా ఉందని వారు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాల కల్పన దిశగా మరింత కృషి జరగాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆత్మగౌరవాన్ని కాపాడుతూ రాష్ట్రం మరింత పురోగతి సాధించాలని కోరుకున్నారు.

అనంతరం పార్టీ జెండాను ఎగురవేసి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏలుగు రాజన్న, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు కొత్తపెళ్లి మహేందర్, ఆశన్న, బీఆర్ఎస్ నాయకులు వెంకటేష్, చంద్రశేఖర్, వెంకన్న, నేతుల గంగన్న, మహిళా అధ్యక్షురాలు సునీత రెడ్డి, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

గొంటి ముక్కుల ప్రసాద్ ,రిపోర్టర్ ,మన భారత్.

మీరు స్థానిక వార్తలు పోస్ట్ చేయడానికి క్రింది ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

ఆ సర్పంచ్ సస్పెండ్ .!

నకిలీ పత్తి విత్తనాల కేసు.. దాబా(బి) సర్పంచ్ సస్పెన్షన్ మన భారత్ | ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల...

వర్షంలో గంటల తరబడి ప్రయాణికుల నిరీక్షణ..

తలమడుగులో ఆర్టీసీ బస్సు క్లచ్ ప్లేట్లు ఫెయిల్.. వర్షంలో గంటల తరబడి ప్రయాణికుల నిరీక్షణ మన భారత్, జూలై 21...

పెరుగుతున్న కరోనా కేసులు..

మాస్క్ ధరించడం మంచిదే: వైద్యుల సూచన మన భారత్ , హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో...

More like this