‘హలో రైతన్న–చలో బోరజ్’ కార్యక్రమానికి గ్రామాల్లో విస్తృత స్పందన
మన భారత్, తాంసి: రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చేపట్టిన ‘హలో రైతన్న–చలో బోరజ్’ కార్యక్రమానికి గ్రామాల్లో విశేష స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను అఖిలపక్ష నాయకులు విస్తృతంగా పంపిణీ చేశారు. అనంతరం తాంసి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, రైతుల హక్కుల కోసం ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సవర్గాం, పొచ్చర, వడ్డాడి, సుంకిడి, తాంసి, కప్పర్ల, నిపాని వంటి గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించిన నాయకులు, ప్రతి రైతు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరారు. రైతుల సమస్యలను అధికారులకు మరింత బలంగా వినిపించేందుకు ఈ ఉద్యమం కీలకమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు బండి దత్తాత్రి, కొండ రమేష్, లోకారి పోశెట్టి, చిలుక దేవిదాస్, విజ్జగిరి నారాయణ తదితరులు పాల్గొన్నారు.
