నయనతార బర్త్ డే.. రూ.10 కోట్ల సర్ప్రైజ్ గిఫ్ట్
మన భారత్, సెలబ్రిటీ: సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ నయనతార బర్త్‌డే (నవంబర్ 18) సందర్భంగా, ఆమె భర్త విఘ్నేశ్ శివన్ మరోసారి తన ప్రేమను విలాసవంతమైన గిఫ్ట్‌తో వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం భార్యకు ఖరీదైన కార్లను బహుమతిగా ఇస్తూ ట్రెండ్‌ను కొనసాగిస్తున్న విఘ్నేశ్, ఈసారి నయనతారకు రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్టర్ ను గిఫ్ట్‌గా అందించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
సుమారు రూ.10 కోట్లు విలువ చేసే ఈ లగ్జరీ కారు, ప్రపంచ ప్రఖ్యాత ఆటోమొబైల్ బ్రాండ్ నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ మోడల్ కావడం విశేషం. నయనతార ఆనందంగా ఈ బహుమతిని స్వీకరించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గత సంవత్సరం కూడా విఘ్నేశ్, నయనతారకు 5 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ GLS 600 కారును గిఫ్ట్ చేశారు. భర్త ప్రేమతో నిండిన ఈ ఖరీదైన బహుమతులు అభిమానుల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
సెలబ్రిటీ దంపతుల రాయల్ లైఫ్‌స్టైల్, లగ్జరీ కార్ల సేకరణపై నెట్‌జన్లలో హాట్ టాపిక్‌గా మారింది.
