శ్రీకాళహస్తి దేవాలయంలో రష్యా భక్తుల సందడి… సంప్రదాయ దుస్తుల్లో ప్రత్యేక దర్శనం
మన భారత్, శ్రీకాళహస్తి: అంతర్జాతీయ భక్తిరసానికి నిలయం అయిన శ్రీకాళహస్తి దేవాలయం మంగళవారం ప్రత్యేక దృశ్యానికి సాక్ష్యమైంది. రష్యాకు చెందిన 40 మంది భక్తుల బృందం ఆలయాన్ని దర్శించుకోవడంతో ప్రాంతీయ భక్తుల్లో ఆసక్తి నెలకొంది. భారత్‌లోని ప్రధాన పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్న ఈ బృందం స్వామి-అమ్మవార్లకు, పరివార దేవతలకు ప్రత్యేకంగా నమస్కరించి విశేష పూజలు నిర్వహించారు.
సంప్రదాయ భారతీయ దుస్తులతో ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన రష్యా భక్తులు ఆలయ చరిత్ర, వైభవం, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి వివరాలు తెలుసుకున్నారు. వీరి దర్శనానికి దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ధర్మకర్తల మండలి సభ్యులు గురప్ప శెట్టి, గోపి భక్తులతో మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు.
విదేశీ పర్యాటకులు, భక్తులు శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించడం ఇక్కడి ఆధ్యాత్మిక మహత్యాన్ని మరోసారి ప్రదర్శించినట్లు స్థానికులు అభిప్రాయపడ్డారు.
#SrikalahastiTemple #RussianDevotees #SpiritualTourism #TempleVisit #ManaBharath.Com
