మున్సిపల్ ఎన్నికల్లో జోరుగా ప్రచారం 

Published on

మన భారత్, తెలంగాణ:

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణకు ఇచ్చిన గడువు మంగళవారం సాయంత్రం 3 గంటలతో ముగియడంతో, ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. దీంతో ఎన్నికల ప్రచారానికి అధికారికంగా తెరలేచింది.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఫిబ్రవరి 11వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఏవైనా చోట్ల రీపోలింగ్ అవసరం వస్తే ఫిబ్రవరి 12న నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.

అనంతరం ఫిబ్రవరి 16న 116 మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలు, 7 కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో స్థానిక పాలనపై పూర్తి స్థాయిలో స్పష్టత రానుంది.

ఈ ఎన్నికల్లో మొత్తం 52,43,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికలు పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. పోలీస్ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి భద్రతా చర్యలు చేపడతామని వెల్లడించారు. రిటర్నింగ్ అధికారులకు రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని ఈసీ కోరింది.

కాగా, ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు ఈ మున్సిపల్ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంత ఓటర్ల తీర్పు ఏ విధంగా ఉండబోతుందన్న అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఈ ఎన్నికల ఫలితాలు రాబోయే రాజకీయ సమీకరణలకు దిశానిర్దేశం చేయనున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వార్డు 19లో మేస్త్రం విలాస్‌కు మద్దతు పెంపు.. గాంధీనగర్ కౌన్సిలర్‌గా గెలిపించాలని బీజేపీ పిలుపు

మన భారత్, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ పట్టణంలోని వార్డు నెంబర్ 19 గాంధీనగర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం వేగం పుంజుకుంది. గాంధీనగర్ కౌన్సిలర్ అభ్యర్థిగా మేస్త్రం విలాస్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు, 19వ వార్డు ఇంచార్జ్ సర్పంచ్ సామ సంతోష్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు స్థానిక సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. మౌలిక వసతుల అభివృద్ధి, కాలనీలో తాగునీరు, డ్రైనేజీ, రహదారుల మెరుగుదల వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రజలు అభివృద్ధి దిశగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గాంధీనగర్ ప్రాంత అభివృద్ధికి మేస్త్రం విలాస్ కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు కూడా అభ్యర్థి పట్ల సానుకూల స్పందన వ్యక్తం చేస్తున్నట్లు నాయకులు తెలిపారు.

ఎన్నికల నిబంధనలు పాటిస్తూ ప్రచారం కొనసాగుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. వార్డు 19లో పోటీ మరింత ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.

Latest articles

10 నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మన భారత్, కేరళ: కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో...

ఆదిలాబాద్ 43వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి కలాల్ శ్రీనివాస్ విజయం

ప్రధాన పార్టీలకు షాక్ – 323 ఓట్ల భారీ మెజారిటీ మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో...

ఆదిలాబాద్ 34వ వార్డులో 12 ఓట్ల తేడాతో ఎంఐఎం విజయం  ఉత్కంఠభరిత పోరులో షేక్ నజీర్ అహ్మద్ గెలుపు

మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 34వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి షేక్ నజీర్ అహ్మద్ హోరాహోరీగా...

ఆదిలాబాద్ 22వ వార్డులో ఎంఐఎం ఘన విజయం..

313 ఓట్ల మెజారిటీతో సమీనా బేగం గెలుపు మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 22వ వార్డులో...

More like this

10 నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మన భారత్, కేరళ: కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో...

ఆదిలాబాద్ 43వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి కలాల్ శ్రీనివాస్ విజయం

ప్రధాన పార్టీలకు షాక్ – 323 ఓట్ల భారీ మెజారిటీ మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో...

ఆదిలాబాద్ 34వ వార్డులో 12 ఓట్ల తేడాతో ఎంఐఎం విజయం  ఉత్కంఠభరిత పోరులో షేక్ నజీర్ అహ్మద్ గెలుపు

మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 34వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి షేక్ నజీర్ అహ్మద్ హోరాహోరీగా...