టీచర్ కూకటి రాజన్న సేవలు మరువలేనివి..

Published on

మన భారత్, ఆదిలాబాద్:

మాంగుర్ల  MPUPS పాఠశాల అభివృద్ధికి పాఠశాల ఉపాధ్యాయుడు కూకటి రాజన్న ఆదర్శంగా నిలిచారు. పాఠశాల గోడలపై బొమ్మలు, అక్షరాలు, జాతీయ నాయకుల చిత్రాల పెయింటింగ్స్ కోసం రూ.10 వేలను పాఠశాల హెచ్ఎం జే. చంద్రకళకి విరాళంగా అందజేశారు.

గత ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయుడు రాజన్న ఇదే విధంగా రూ.10 వేలు విరాళంగా ఇచ్చిన విషయం గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా గ్రామ యువకులు అందించిన రూ.21 వేల సహకారంతో పాఠశాల ఆవరణలో స్టేజ్ నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అడ లక్మణ్, ఉప సర్పంచ్ మునాఫ్, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు పి. సతీష్, టి. వినోద్ తదితరులు ఉపాధ్యాయుడు రాజన్న చేస్తున్న సేవలను కొనియాడుతూ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. పాఠశాల అభివృద్ధిలో ఉపాధ్యాయుల సేవాభావం విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.

ఇలాంటి సేవా కార్యక్రమాలు గ్రామ విద్యాభివృద్ధికి బలమైన పునాది వేస్తాయని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Latest articles

10 నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మన భారత్, కేరళ: కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో...

ఆదిలాబాద్ 43వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి కలాల్ శ్రీనివాస్ విజయం

ప్రధాన పార్టీలకు షాక్ – 323 ఓట్ల భారీ మెజారిటీ మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో...

ఆదిలాబాద్ 34వ వార్డులో 12 ఓట్ల తేడాతో ఎంఐఎం విజయం  ఉత్కంఠభరిత పోరులో షేక్ నజీర్ అహ్మద్ గెలుపు

మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 34వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి షేక్ నజీర్ అహ్మద్ హోరాహోరీగా...

ఆదిలాబాద్ 22వ వార్డులో ఎంఐఎం ఘన విజయం..

313 ఓట్ల మెజారిటీతో సమీనా బేగం గెలుపు మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 22వ వార్డులో...

More like this