మన భారత్, తెలంగాణ:
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమై ఈ నెల 30 వరకు కొనసాగనుంది. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ మేరకు అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో తమ నామినేషన్ పత్రాలను సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది.
ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే సమయంలో అవసరమైన పత్రాలను తప్పనిసరిగా సమర్పించాలని అధికారులు స్పష్టం చేశారు. పత్రాల లోపాలు లేకుండా పూర్తి వివరాలతో నామినేషన్ వేయాలని సూచించారు.
నామినేషన్‌కు అవసరమైన పత్రాలు ఇవే:..
* నామినేషన్ ఫారం
* పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం (SSC సర్టిఫికెట్ / ఓటర్ ఐడీ / ఆధార్ కార్డు జిరాక్స్)
* కుల ధ్రువీకరణ పత్రం (రిజర్వుడు స్థానాలకు మాత్రమే)
* నామినేషన్ డిపాజిట్ రసీదు
* సెల్ఫ్ అఫిడవిట్ (ఆస్తులు, విద్యార్హతలు, కేసుల వివరాలు)
* కొత్త బ్యాంక్ అకౌంట్ జిరాక్స్
* సెల్ఫ్ డిక్లరేషన్
* ప్రాపర్టీ నో డ్యూ సర్టిఫికెట్
* పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లకు సిద్ధమవుతున్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం పరిశీలన, ఉపసంహరణ దశలు కొనసాగనున్నాయి. ఈ ఎన్నికలతో పట్టణ పాలనపై ప్రజాస్వామ్య నిర్ణయం వెలువడనుందని అధికారులు తెలిపారు.
