ముగ్గురు మంత్రులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అత్యవసర భేటీ

Published on

మన భారత్ , తెలంగాణ:

తెలంగాణ రాజకీయాల్లో సోమవారం సాయంత్రం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. లోక్‌భవన్‌లో జరిగిన కార్యక్రమం ముగిసిన వెంటనే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రజాభవన్‌లో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ అకస్మాత్తు భేటీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

సింగరేణి అంశం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ చర్చకు దారితీసిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా నైనీ కోల్డ్ టెండర్ అంశంపై విపక్ష బీఆర్ఎస్ తీవ్రంగా స్పందిస్తున్న పరిస్థితుల్లో, ఆ పార్టీ నేతలు గవర్నర్‌ను కలిసేందుకు సిద్ధమవుతున్నారన్న నేపథ్యంలో ఈ భేటీ హాట్ టాపిక్‌గా మారింది.

ప్రభుత్వ వైఖరి, భవిష్యత్ కార్యాచరణ, రాజకీయంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. సింగరేణి విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ముందస్తు వ్యూహం రూపొందించడమే ఈ భేటీ ఉద్దేశమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

రాష్ట్రంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశం రాబోయే రాజకీయ పరిణామాలకు దిశానిర్దేశం చేసే అవకాశముందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Latest articles

10 నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మన భారత్, కేరళ: కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో...

ఆదిలాబాద్ 43వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి కలాల్ శ్రీనివాస్ విజయం

ప్రధాన పార్టీలకు షాక్ – 323 ఓట్ల భారీ మెజారిటీ మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో...

ఆదిలాబాద్ 34వ వార్డులో 12 ఓట్ల తేడాతో ఎంఐఎం విజయం  ఉత్కంఠభరిత పోరులో షేక్ నజీర్ అహ్మద్ గెలుపు

మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 34వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి షేక్ నజీర్ అహ్మద్ హోరాహోరీగా...

ఆదిలాబాద్ 22వ వార్డులో ఎంఐఎం ఘన విజయం..

313 ఓట్ల మెజారిటీతో సమీనా బేగం గెలుపు మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 22వ వార్డులో...

More like this