వరల్డ్ బాక్సింగ్ కప్‌లో నిఖత్ జరీన్ మెరుపు

Published on

వరల్డ్ బాక్సింగ్ కప్‌లో నిఖత్ జరీన్ మెరుపు

ఫైనల్లో ఏకపక్ష విజయం – భారత్‌కు ‘పసిడి’ పంచ్

మన భారత్, స్పోర్ట్స్: భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ మరోసారి తన ప్రతిభను నిరూపించారు. వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్లో 51 కిలోల విభాగంలో అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. చైనీస్ తైపీకి చెందిన జువాన్ యి గువోపై 5-0 తేడాతో నిఖత్ ఏకపక్షంగా గెలిచి ప్రపంచ వేదికపై మరోసారి భారత జెండాను ఎగురవేశారు.

నిఖత్ జయంతో భారత్‌కు ఐదు గోల్డ్‌లు

ఈ విజయంతో ఈ టోర్నీలో భారత మహిళలు సాధించిన గోల్డ్ పతకాల సంఖ్య 5కు చేరుకుంది. మొత్తంగా భారత్ ఖాతాలో:

9 గోల్డ్ మెడల్స్

6 సిల్వర్ మెడల్స్

5 బ్రాంజ్ మెడల్స్ నమోదు అయ్యాయి.

అంతర్జాతీయ స్థాయిలో భారత బాక్సర్ల ఆధిపత్యాన్ని మరోసారి నిఖత్ ప్రదర్శన ప్రపంచానికి చూపించింది.

నిఖత్ – భారత బాక్సింగ్ గర్వం

ప్రస్తుతం భారత మహిళా బాక్సింగ్‌కు నిఖత్ జరీన్ ప్రధాన ప్రతీకగా నిలుస్తున్నారు. ప్రతి టోర్నీలోనూ తన స్థాయిని పెంచుకుంటూ గెలుపుల పరంపర కొనసాగిస్తున్నారు. శారీరక నైపుణ్యం, రింగ్‌లో స్పీడ్, ఖచ్చితమైన పంచ్‌లతో ప్రత్యర్థులకు తలొగ్గిస్తున్నారు.

Latest articles

10 నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మన భారత్, కేరళ: కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో...

ఆదిలాబాద్ 43వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి కలాల్ శ్రీనివాస్ విజయం

ప్రధాన పార్టీలకు షాక్ – 323 ఓట్ల భారీ మెజారిటీ మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో...

ఆదిలాబాద్ 34వ వార్డులో 12 ఓట్ల తేడాతో ఎంఐఎం విజయం  ఉత్కంఠభరిత పోరులో షేక్ నజీర్ అహ్మద్ గెలుపు

మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 34వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి షేక్ నజీర్ అహ్మద్ హోరాహోరీగా...

ఆదిలాబాద్ 22వ వార్డులో ఎంఐఎం ఘన విజయం..

313 ఓట్ల మెజారిటీతో సమీనా బేగం గెలుపు మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 22వ వార్డులో...

More like this