ఈ–పంచాయతీ యూనియన్‌ ఏకగ్రీవ ఎన్నిక

Published on

📰 Generate e-Paper Clip

ఈ–పంచాయతీ యూనియన్‌లో కొత్త కమిటీ ఎన్నికల్లో ఉపాధ్యక్షుడిగా కలకొండ శివకృష్ణ

మన భారత్ నల్లగొండ :
నల్లగొండ జిల్లా ఈ–పంచాయతీ ఉమ్మడి ఆపరేటర్స్ యూనియన్ కేంద్ర కార్యాలయంలో సోమవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల ఈ–పంచాయతీ ఆపరేటర్లు పాల్గొని కొత్త యూనియన్‌ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా అధ్యక్షుడిగా కనగల్ మండలానికి చెందిన కందుల వెంకన్న ఎంపిక కాగా, త్రిపురారం మండల ఈ–పంచాయతీ ఆపరేటర్ కలకొండ శివకృష్ణ ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా తండు లింగస్వామి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో నల్లగొండ జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు ఖాసీం, ఉమ్మడి ఈ–పంచాయతీ వింగ్ డీ.పీ.యం బాణాల గంగాధర్ తదితరులు పాల్గొని కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఖాసీం మాట్లాడుతూ, ఈ–పంచాయతీ వ్యవస్థ గ్రామీణ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తోందని, ఆపరేటర్లు సాంకేతికంగా మరింత నైపుణ్యంతో సేవలు అందించాలని సూచించారు. బాణాల గంగాధర్ మాట్లాడుతూ, గ్రామీణ పాలనలో డిజిటల్ పారదర్శకత తీసుకురావడంలో ఈ–పంచాయతీ యూనియన్ ప్రధాన భాగస్వామిగా నిలుస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని మండలాల ఈ–పంచాయతీ ఆపరేటర్లు, ఉద్యోగులు మరియు సంఘ నాయకులు పాల్గొన్నారు. కొత్త కమిటీ సభ్యులు తమ బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తిస్తామని హామీ ఇచ్చారు.

Latest articles

పోరండ్ల సంతోష్ అను నేను.. దేవాపూర్ సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న..

దేవాపూర్ గ్రామ సర్పంచ్‌గా సంతోష్ ప్రమాణ స్వీకారం మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామానికి నూతన సర్పంచ్‌గా...

కజ్జర్ల సర్పంచ్‌గా ఎల్మ నారాయణరెడ్డి ప్రమాణ స్వీకారం..

గ్రామాభివృద్ధే ధ్యేయం.. కజ్జర్ల సర్పంచ్‌గా ఎల్మ నారాయణరెడ్డి ప్రమాణ స్వీకారం మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామానికి...

మర్రి చెట్టు నీడలో ప్రమాణ స్వీకారం..

మర్రి చెట్టు నీడలో ప్రజాస్వామ్య ప్రమాణం.. సకినాపూర్ సర్పంచ్‌గా నికిత నగేష్ ప్రమాణ స్వీకారం మన భారత్, ఆదిలాబాద్: తలమడుగు...

సాయి కిరణ్ కు ఘన సన్మానం..

యూపీఎస్సీలో పొన్నారి యువకుడి సత్తా – సాయి కిరణ్‌కు ఘన సన్మానం మన భారత్, ఆదిలాబాద్ : జిల్లా తాంసి...

More like this