రోడ్లపై నమాజ్‌కు అనుమతి లేదు: సీఎం
మన భారత్, లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి Yogi Adityanath రాష్ట్రంలో రోడ్లపై నమాజ్ నిర్వహించడంపై కఠిన వ్యాఖ్యలు చేశారు. ప్రజా రహదారులను ప్రార్థనల కోసం వినియోగించకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. లక్నోలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సీఎం యోగి, రోడ్లు ప్రజల రాకపోకల కోసం మాత్రమేనని, ఎలాంటి మతపరమైన కార్యక్రమాల కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకూడదని తెలిపారు. ప్రార్థనలు నిర్వహించడానికి ఇంట్లో లేదా ప్రార్థనా స్థలాల్లో తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించిన...