శ్రీవారిని దర్శించుకున్న మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష..
మన భారత్, ఆదిలాబాద్: పవిత్ర ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని బండారి అనూష సతీష్ దంపతులు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు స్వామివారి ఆశీస్సులు తీసుకుని ప్రజల సంక్షేమం, ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి, ప్రజల సుఖశాంతుల కోసం ప్రార్థనలు చేశారు. ఏకాదశి సందర్భంగా తిరుమల క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్న బండారి అనూష సతీష్ దంపతులు స్వామివారి సర్వదర్శనంలో...