ఇస్త్రీ చేస్తూ షాక్ గురై వ్యక్తి మృతి..
మన భారత్, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలోని వేమనపల్లి మండలం జక్కపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. దుస్తులు ఇస్త్రీ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన కమలాకర్ శుభకార్యానికి వెళ్లేందుకు ఇంట్లో బట్టలు ఇస్త్రీ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా విద్యుత్ షాక్ తగిలి కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే అతడిని చికిత్స నిమిత్తం బెల్లంపల్లి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే...