దళిత మహిళలపై దాడులు సరైనది కాదు..
మన భారత్, విజయనగరం: విజయనగరం జిల్లా జామి, కొత్తవలసతో పాటు పలు మండలాల్లో దళిత మహిళలపై దాడులు పెరుగుతున్నాయని అఖిలభారత మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తలి గౌరీ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారని విమర్శించారు. ప్రజలకు న్యాయం చేయాల్సిన అధికారులే పెత్తందారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ దళితులకు అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో దళిత మహిళలు భయభ్రాంతులకు గురవుతున్నారని, పలుచోట్ల వేధింపులు, దాడులు జరిగినప్పటికీ...