చీకటి కష్టాలకు చెక్ పెట్టిన ఎమ్మెల్యే..
మన భారత్, శృంగవరపుకోట: శృంగవరపుకోట నియోజకవర్గంలోని ఎస్.కోట మండలం ఆలుగుబిల్లి గ్రామ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. గ్రామం నుంచి జాగరపు వారి కల్లాల వరకు నెలకొన్న చీకటి సమస్యకు పరిష్కారం చూపుతూ ఏర్పాటు చేసిన నూతన విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలను ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్తో కలిసి ప్రారంభించారు. గ్రామస్తులు చాలా కాలంగా ఈ మార్గంలో విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరుతూ వస్తుండగా, ప్రజల సమస్యను గుర్తించిన ప్రజాప్రతినిధులు వెంటనే...