నిప్పు రవ్వలతో మొక్కజొన్న పంట దగ్ధం
మన భారత్, నాగర్ కర్నూలు: నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం అల్లిపూర్ గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి నిప్పు రవ్వలు పడి మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమై రైతు తీవ్ర నష్టాన్ని చవిచూశాడు. బాధితుడు డొక్కా శ్రీనివాస్‌కు చెందిన సుమారు 2.10 గుంటల భూమిలో సాగు చేసిన పంట అగ్నికి ఆహుతైంది. స్థానికుల వివరాల ప్రకారం, ట్రాన్స్‌ఫార్మర్‌లో సాంకేతిక లోపం కారణంగా నిప్పు రవ్వలు పడి పంటలో మంటలు చెలరేగాయి. సమాచారం...