గుర్ల పోలీసుల నఖాబంది..
మన భారత్, విజయనగరం : విజయనగరం జిల్లా గుర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం పోలీసులు విస్తృత స్థాయిలో నఖాబంది (వాహన తనిఖీలు) నిర్వహించారు. ముఖ్య జంక్షన్ల వద్ద ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీలు చేపట్టినట్లు ఎస్సై నారాయణ రావు తెలిపారు. ఈ సందర్భంగా వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు, ఇన్సూరెన్స్ తదితర వివరాలను పరిశీలించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి హెచ్చరికలు జారీ చేయడంతో పాటు, నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు....