దివ్యాంగురాలి కుటుంబానికి అండగా సర్పంచ్
మన భారత్, మొగుళ్ళపల్లి: సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న మొగుళ్ళపల్లి గ్రామ సర్పంచ్ చాట్ల విజయ–రవీందర్ దంపతులు మానవత్వానికి ప్రతీకగా నిలిచారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా మండల కేంద్రానికి చెందిన ఓ దివ్యాంగురాలి కుటుంబానికి అండగా నిలిచి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా సర్పంచ్ దంపతులు టీఆర్‌సీపీటీయూ సభ్యులతో కలిసి స్వయంగా ఆ కుటుంబాన్ని సందర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే వారి జీవనోపాధికి అవసరమైన నెలవారీ నిత్యావసర సరుకులను అందించి సహానుభూతి చాటారు....