అగ్ని ప్రమాదంలో 16 ఎకరాల పంట దగ్ధం..
మన భారత్, మొగుళ్ళపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు సంభవించిన అగ్ని ప్రమాదంలో రైతులు కష్టపడి సాగు చేసిన మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. సుమారు 16.20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పంట కాలిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టి, చెమటోడ్చి పండించిన పంట కళ్లముందే బూడిద కావడంతో రైతుల జీవితం దెబ్బతిన్నది. చేతికొచ్చే దిగుబడి కోల్పోవడంతో ఆర్థికంగా తీవ్ర...