ఇస్సిపేటలో ఘనంగా మేడే వేడుకలు..
మన భారత్, మొగుళ్ళపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ఇస్సిపేట గ్రామంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హమాలీ కార్మిక సంఘం అధ్యక్షుడు మోహన్ రెడ్డి ఎర్రజెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన మాట్లాడుతూ, కార్మికుల హక్కుల కోసం జరిగిన చారిత్రక పోరాటాల ఫలితంగానే మేడే ప్రాముఖ్యత ఏర్పడిందని అన్నారు. 140 సంవత్సరాల క్రితం కార్మికులు ఎదుర్కొన్న అన్యాయ పరిస్థితులను...