ప్రజాస్వామ్యానికి పంచాయతీలే పునాది
మన భారత్, తలమడుగు: ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి గ్రామ పంచాయతీల పాత్ర కీలకమని సుంకిడి సర్పంచ్ నర్సమ్మ పేర్కొన్నారు. తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో శుక్రవారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ వేడుకలో సర్పంచ్ నర్సమ్మ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీలు ప్రజాస్వామ్యానికి పునాది వంటివని, గ్రామ స్థాయి పాలన బలంగా ఉంటేనే దేశం అభివృద్ధి దిశగా దూసుకుపోతుందని తెలిపారు....